Citizen Youth Parliament: యువతలో రాజకీయ స్ఫూర్తి నింపడమే లక్ష్యం..స్వాతి చంద్రశేఖర్ ఆదర్శం

By :  Aruna
Update: 2023-09-28 12:55 GMT

స్వాతి చంద్రశేఖర్... సిటిజన ఇండియా సీఈఓ. కన్నడ ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. ప్రముఖ యాంకర్‎గా.. జర్నలిస్టుగా మీడియాలో తన సత్తాను చాటిన స్వాతి ఇప్పుడు యువతలో రాజకీయ స్ఫూర్తి నింపాలనే లక్ష్యంతో ముందకు సాగుతున్నారు. యూత్ పార్లమెంట్ అనే కాన్సెప్ట్‎తో దక్షిణాది యువతను రాజకీయాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా సిటిజన్ ఇండియా అనే సంస్థను నెలకొల్పి రాజకీయాలపై యువతలో ఆసక్తి పెంచేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మీరు భారత పార్లమెంట్ సభ్యులు కావచ్చని..పార్లమెంటులో మీ వాగ్ధాటితో దేశం మొత్తాన్ని ఆకర్షించవచ్చని నేటితరాన్ని చైతన్యవంతం చేసే ఆమె ప్రయత్నం హర్షించదగిన విషయం. అందరికీ ఆదర్శప్రాయం.

రాజకీయాలు చెడ్డవని, రాజకీయనాయకులు అయ్యే అర్హత తమకు లేదని యువత భావిస్తుంటుంది. కానీ ఎవ్వరూ పొలిటీషియన్‎గా మారి దేశ అభివృద్ధికి భాగం అవ్వాలని ఆలోచించరు. ఒకవేళ ఆ ఆలోచన వచ్చినా అందుకు తగిన ప్రోత్సాహం వారికి అందదు. అందుకే సిటిజన్ యూత్ పార్లమెంట్ అనే కొత్త ప్రోగ్రామ్‎ను స్వాతి చంద్రశేఖర్ తెరముందుకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా నేను పార్లమెంట్‎లో ఓ మెంబర్ కాగలను అనే కాన్ఫిడెన్స్‎ను యువతలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్వాతి.

ఈ వినూత్న కార్యక్రమానికి త్వరలో హైదరాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 8,9,10 తేదీల్లో హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యూత్ పార్లమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ప్రోగ్రామ్‎లో పాల్గొనే అవకాశం కల్పించారు.అర్హులేన వారు అక్టోబర్ 3 లోగా గూగుల్ ఫార్మ్ నింపి తమ సీటు కన్ఫర్మ్ చేసుకోవాలని కోరుతున్నారు స్వాతి.

కర్ణాటకలో టీవీ 5కి ఢిల్లీ బ్యూరో హెడ్ గా పని చేశారు స్వాతి. జర్నలిజం నుంచి బయటికి వచ్చి 2022లో సిటిజన్ ఇండియా అనే సంస్థను నెలకొల్పారు. పార్లమెంట్‎లో దక్షిణ ప్రాంత వాసుల వాయిస్ వినిపించాలనేది ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఆగస్టులో బెంగళూరులో మొదటిసారిగా నిర్వహించిన యూత్ పార్లమెంట్‎కు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత పార్లమెంటేరియన్ కాగల మెలకువలు తెలుసుకున్నారని స్వాతి తెలిపారు. ఇప్పుడు తెలంగాణ

యువత కోసం, 9 ఏళ్ల తెలంగాణ అనే అంశంతో యూత్ పార్లమెంట్‎ను హైదరాబాద్‎లో నిర్వహించనున్నామని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది సరైన ప్లాట్ ఫామ్ అని చెప్పారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా రియల్ పార్లమోంట్‎లో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తమ ప్రతిభను చూపించి

ఢిల్లీలో జరిగే నేషనల్ లెవెల్ యూత్ పార్లమెంటులో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు.

స్వాతీ చంద్రశేఖర్, సీఈఓ, సిటిజన్ ఇండియా

https://forms.gle/3rshpgfR5fe4ACUa9

సంప్రదించాల్సిన నెంబర్లు : +91 9319256888

+91 8951879312

citizenyouthparliament@gmail.com

Tags:    

Similar News