బీఎస్పీ, బీఆర్ఎస్ సీట్ల పంపిణీపై క్లారిటీ.. ఏనుగు పార్టీకి 2 ఎంపీ స్థానాలు

Byline :  Vamshi
Update: 2024-03-15 07:08 GMT

పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్, బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయించింది. నాగర్‌కర్నూల్‌తో పాటు హైదరాబాద్ ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.తాజాగా, ఈ రోజు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. పొత్తులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థులు పోటీచేస్తారు. ఈ రెండు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు బీఆర్ఎస్ నేతలు పూర్తి సహకారం అందిస్తారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగుతుంది.

కాగా, బీఆర్ఎస్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ తెలంగాణ చీఫ్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని సమాచారం. పొత్తులో భాగంగా గులాబీ పార్టీ 15 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా రెండు స్థానాలు ఏనుగు పార్టీకి కేటాయించారు.బీఎస్పీకి ఆదిలాబాద్ లోక్ సభ కేటాయిస్తారని భావించినప్పుడుకి మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కుకు ఇచ్చారు.ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. మెుత్తం 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తో పొత్తుకు ఓకే చెప్పింది. వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా.. సీట్ల షేరింగ్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రస్తుతానికి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News