కేసీఆర్కు ఎన్ని ఆస్తులు, అప్పులు ఉన్నాయో తెలుసా ..?

By :  Krishna
Update: 2023-11-09 12:36 GMT

సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేశారు. తన అఫిడవిట్లో కేసీఆర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తనకు రూ.17.83కోట్ల స్థిరాస్తులు, రూ.9.67 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన చేతిలో 2లక్షల 96వేల క్యాష్ ఉన్నట్లు వివరించారు.

2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ కలిపి రూ.5.63 కోట్ల రూపాయలు ఉన్నాండగా.. ఇప్పుడది మరో 11.16 కోట్లకు పెరిగింది. కేసీఆర్‌ సతీమణి శోభ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.6.29 కోట్లకు చేరింది. 2.8 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తాజా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్‌ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు ఉండగా.. కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉన్నట్లు అందులో ఉంది. కేసీఆర్కు సొంత కారు, బైక్ లేదు. అయితే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ వంటి 14 వాహనాలు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరు మీద గుంట భూమి లేదని కేసీఆర్ అఫిడవిట్‌లో ప్రస్తావించారు. అయితే తన కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉన్నట్లు వివరించారు.


Tags:    

Similar News