ప్రజా కళలు, ఉద్యమానికి గద్దర్ చేసిన సేవలు మరువలేం - సీఎం కేసీఆర్
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన కళాకారుడి మరణం బాధాకరణమని అన్నారు. ప్రజా కళలకు, ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాధారణ బుర్ర కథ కళాకారుడిగా జీవితం ప్రారంభించిన గద్దర్.. విప్లవ పంథాలో మమేకమయ్యారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటతో పల్లెపల్లెన తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేశారన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ జూలై 20న అపోలో హాస్పిటల్లో చేరారు. ఇటీవలే ఆయన గుండెకు సర్జరీ జరిగింది. త్వరలో కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారనుకుంటున్న సమయంలో ఆయన హఠాత్తుగా కన్నుమూశారు.