పరేషాన్ ఒద్దు.. మూడోసారి అధికారంలోకి వస్తున్నాం : కేసీఆర్

By :  Krishna
Update: 2023-12-01 11:52 GMT

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. లేక హస్తం పార్టీ అదరగొడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆదివారం నాడు తప్పని రుజువైతాయని బీఆర్ఎస్ చెబుతోంది. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో తమదే హవా అని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు.

రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారితో..పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలిసింది. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై సీఎంతో వారు చర్చించారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని కేసీఆర్ సూచించారు. రెండు రోజులు ప్రశాంతంగా ఉండాలన్న సీఎం.. ఆదివారం రోజు పెద్దఎత్తున సంబరాలు చేసుకుందామని వారితో చెప్పినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News