గత కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేసీఆర్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని సెప్టెంబర్ 26న చెప్పిన కేటీఆర్ ఇప్పుడు మరో కీలక విషయం వెల్లడించారు. కేసీఆర్కు ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ‘‘సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్ తర్వాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చింది. వేగంగా కోలుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు’’ అని కేటీఆర్ చెప్పారు.
వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంపై బీఆర్‌ఎస్ నేతలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న వేళ కేసీఆర్ అనారోగ్యం చర్చనీయాంశంగా మారింది.