ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద అంబులెన్స్, అమ్మ ఒడి, పార్థివదేహాల తరలింపు వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 204అంబులెన్స్‌లు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పార్థివదేహాల తరలింపు వాహనాలు ఉన్నాయి. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.
అత్యవసర సేవలను అందించే 466 అధునాతన వాహనాలను ఒకేరోజు ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 455కు చేరిందన్నారు. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేల మందికి ఒక వాహనం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. గతంలో అంబులెన్స్ సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడు 15 నిమిషాలకు తగ్గిందన్నారు.
అమ్మ ఒడితో రోజుకు 4 వేల మందికి, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నట్లు హరీష్ రావు చెప్పారు. 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతామని తెలిపారు. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే కడుతుందని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో కొత్తగా నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజ్, నాలుగు టీమ్స్, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
కరోనా లాంటి ఏ రోగం వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీష్ చెప్పారు. తమకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉందనే భరోసా ప్రజలకు కలిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో కొట్లాటలు, కరెప్షన్ తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
హైదరాబాద్‌లో 108 అంబులెన్స్‌లు, అమ్మఒడి (102 సర్వీస్), హర్సె వాహనాలను (మొత్తం 466) జెండా ఊపి ప్రారంభించిన సీఎం శ్రీ కేసీఆర్
— BRS Party (@BRSparty) August 1, 2023
CM Sri KCR flagged off '108 Ambulances' and 'Amma Vodi' vehicles in Hyderabad.#AarogyaTelangana pic.twitter.com/eE7zVNgASN