BRS సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, HRD కేంద్రానికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

Update: 2023-06-05 08:16 GMT



హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మిస్తున్న భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) శంకుస్థాపన చేశారు. భారీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కే కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌, దామోదర్‌ రావు, సురేశ్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలె యాదయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.




 


ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తున్నది. రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ‘భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌’ కేంద్రాన్ని నెలకొల్పనున్నది. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.




Tags:    

Similar News