మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరిన కేసీఆర్‌

Update: 2023-06-26 06:21 GMT

సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్- ముంబై హైవే మీదుగా భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. కాన్వాయ్‌లో రెండు బస్సులు, సుమారు 600 వాహనాలు ఉన్నాయి. కేసీఆర్‌ బస్సులో ముందు సీటులో కూర్చున్నారు. కాన్వాయ్ సంగారెడ్డి మీదుగా బయల్దేరి రోడ్డు మార్గాన మహారాష్ట్ర చేరుకోనుంది. రెండు రోజుల పాటు సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కేసీఆర్‌ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు. పర్యటనకు బయల్దేరే ముందు హోం మంత్రి మహమూద్ అలీ కేసీఆర్ రక్షా కవచం కట్టారు.




 


సీఎం పర్యటన క్రమంలో సంగారెడ్డి పోలీసులు అలర్ట్ అయ్యారు. హైవేపై 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లే సమయంలో సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల సీఎం ఆగే అవకాశముంది. దీంతో ఎక్కడిక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ పర్యటనలో భాగంగా పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకోనున్న కేసీఆర్.. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రానికి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కేసీఆర్ చేరుకుంటారు. 




 







 



 



Tags:    

Similar News