సిఎం కెసిఆర్‌ మెదక్ జిల్లా పర్యటన వాయిదా

Update: 2023-08-16 09:23 GMT

సిఎం కెసిఆర్‌ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 19న సిఎం కెసిఆర్‌ మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. అనంతరం కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే సీఎం పర్యటనను ఈనెల 19 నుంచి 23కి వాయిదా వేశారు. కేసీఆర్ పర్యటించిన రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో రీ షెడ్యూల్ చేశారు. సిఎం కెసిఆర్‌ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా నుండి భారీగా జన సమీకరణకు ప్లాన్ వేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ టూర్ వాయిదా పడడం బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను నిరాశకు గురిచేసింది.


Tags:    

Similar News