స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ తే నీటి విందు కార్యక్రమం రాజకీయ నేతల హడావిడి లేక వెలవెలబోయింది. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ఎట్ హోం ప్రోగ్రాంకు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం వరుసగా మూడోసారి.
ప్రభుత్వం తరఫున సీఎస్ శాంత కుమారి ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ మంత్రులు ఇతర నేతలెవరూ రాలేదు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సైతం ఎట్ హోం కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ నుంచి నాయకులెవరూ ఈ ప్రోగ్రాంకు రాలేదు. తెలంగాణ బీజేపీ కీలక నేతలు సైతం దూరంగా ఉండటం విశేషం. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు మరికొందరు ప్రముఖులు మాత్రమే రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
cm kcr skips at home programme at rajbhavan