కాంగ్రెస్ చేతకానితనం వల్లే సింగరేణిలో కేంద్రానికి వాటా : కేసీఆర్

By :  Krishna
Update: 2023-11-24 13:24 GMT

సింగేణి కార్మికులకు వెయ్యి కోట్లు బోనస్గా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని.. కానీ తాము బోనస్, లాభాల వాటా కింద 32శాతం ఇచ్చామని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ సింగరేణిని నిండా ముంచిందని ఆరోపించారు. కేంద్రం వద్ద అప్పులు తీసుకుని.. అవి కట్టలేక 49శాతం వాటా అమ్ముకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ చేతకానితనం వల్లే సింగరేణిలోని సగం వాటా కేంద్రానికి పోయిందన్నారు. కానీ బీఆర్ఎస్ వచ్చాక సింగరేణి లాభాల్లో పయనిస్తుందని చెప్పారు. సింగ‌రేణిని అన్ని ర‌కాలుగా కాపాడే బాధ్య‌త తీసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో భూపాలపల్లి ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గండ్ర వెంకటరమణారెడ్డికి ఎంతో అనుభవం ఉందని.. ఆయన మరోసారి గెలిస్తే నియోజకవర్గానికి మరింత మేలు జరుగుతుందన్నారు. లేకపోతే నియోజకవర్గం ఆగమైతదని హెచ్చరించారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News