గోల్కొండ కోట‌పై జాతీయ జెండా ఎగుర‌వేసిన సీఎం కేసీఆర్

Update: 2023-08-15 05:44 GMT

77వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైద‌రాబాద్ లోని గోల్కొండ కోటపై తీయ జెండాను ఎగురవేశారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. గొల్కొండ కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో జాతీయ జెండా రెపరెపలాడింది. జెండా ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తున్నారు. ఎంతో కష్టపడి, మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, ఇప్పుడు స్వేచ్ఛగా బతికే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా స్వేచ్ఛ లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంతో కష్టపడి, ఎందరి పోరాటాల కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకలి చావులు, దుర్భరమైన బతుకులు ఇలా చెప్పుకొంటూ పోతో ఎన్నో కష్టాలు ఉండేవని, దీంతో రాష్ట్ర ప్రజల బతుకులు బాగు కోసం తెలంగాణ సాధించుకున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం నడిచింది కేసీఆర్‌ పేర్కొన్నారు.

పవిత్ర యజ్ఞంగా తెలంగాణ పునర్నిర్మాణం జరిగిందన్నారు సీఎం. అన్ని రంగాలలో ప్రక్షాళన జరిగిందని... తమ ప్రభుత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది అని చెప్పారు. అంత‌కుముందు కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజ‌నీ కుమార్, హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్, కళాకారులు ఘ‌న‌ స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళులర్పించారు.

Tags:    

Similar News