CM KCR Health: సీఎం కేసీఆర్కు అనారోగ్యం.. ఇంట్లోనే ట్రీట్మెంట్
"తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యం పాలయ్యారు". గత వారం రోజులుగా ఆయన వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. (CM Kcr suffering with viral fever )ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.
"సీఎం కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఆయనకు డాక్టర్ల బృందం ఇంట్లోనే చికిత్స ఇస్తోంది. వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
CM KCR Garu has been suffering from Viral Fever and Cough for the last one week.
— KTR (@KTRBRS) September 26, 2023
He is being treated at home by his medical team and is being monitored closely. As per Doctors he should be able to get back to normalcy in a few days