సీఎం కేసీఆర్ సూర్యాపేట సభ వాయిదా

Update: 2023-07-20 17:02 GMT

బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 24న సూర్యాపేటలో నిర్వహించాలనుకున్న సభ వాయిదా పడింది. కుండపోత వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 24న సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ బిల్డింగులను సీఎం ప్రారంభించాల్సి ఉంది. అనంతరం భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.

గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా సూర్యాపేట పర్యటన వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా పలు జిల్లాలు ప్రభావితమైనందున ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించే అవకాశముంది. సూర్యాపేట పర్యటనకు సంబంధించి త్వరలోనే మరో షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.



Tags:    

Similar News