ఈరోజు రాత్రి లేదా రేపు 80-90 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం కేసీఆర్.

Update: 2023-08-18 11:55 GMT

తెలంగాణలో ఎన్నికల వేడి షురూ అయ్యింది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ కసరత్తు పూర్తైపోయింది. దాదాపుగా సిట్టింగ్ అభ్యర్థులకే సీటు కన్ఫార్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రాత్రి లేదా రేపు ఉదయం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టును కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 119 స్థానాలకు గాను 112 మంది అభ్యర్థులను కేసీఆర్ ఫైనల్ చేశారని సమాచారం. కేవలం 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల మార్పు ఉండనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్‎లో రెండు, ఉమ్మడి వరంగల్‎లో ఒకటి, ఉమ్మడి కరీంనగర్‎లో ఒకటి , ఉమ్మడి రంగారెడ్డి‎లో ఒకచోట అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని బట్టి 95 శాతం సిట్టింగ్ అభ్యర్థులకే కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమైన నేతల బుజ్జగింపు చర్యలు కూడా పూర్తైనట్లు సమాచారం. ఒక ఎమ్మెల్సీ, ఒక జెడ్పీ ఛైర్మన్‎కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారు కేసీఆర్.

కేసీఆర్ గనుగ లిస్టును ప్రకటిస్తే నోటిఫికేషన్‎కు ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసినట్లు లెక్క. ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా, మిగిలిన అన్ని చోట్ల అభ్యర్థులను కేసీఆర్ ఫైనల్ చేశారు. దీంతో సీఎం కేసీఆర్ గేమ్ ప్లాన్‌ ఏంటి..? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే 95 శాతం సీట్లు కేటాయించడం వెనుక మతలబేంటని పెద్ద రాజకీయ చర్చ నడుస్తోంది. అసంతృప్తితో ఉన్న నాయకులను కేసీఆర్ ఎలా బుజ్జగించారు.. వారికి ఎలాంటి హామీలు ఇచ్చారన్నదానిపైన డిస్కషన్ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం ఉండగానే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసి యాక్షన్‎లోకి దూకారని ప్రస్తుత స్పీడ్‎ను చూస్తే అర్థమవుతుంది. శ్రావణం సెంటిమెంట్‌‎ను కేసీఆర్ ఫాలో అవుతున్నారా? అన్న చర్చ కూడా నడుస్తోంది.

కేసీఆర్ దూకుడు పెంచడంతో అటు కాంగ్రెస్ కూడా గాంధీభవన్‌లో అసెంబ్లీ టికెట్ దరఖాస్తుల ప్రక్రియను మొదలుపెట్టేసింది. అభ్యర్థులు, వారి అనుచరులతో గాంధీభవన్‌ హడావుడిగా మారింది. మరి ఈ రేసులో బీజేపీ మాత్రం కాస్త వెనకబడినట్లు తెలుస్తోంది.



CM, KCR ,to release first list,BRS MLA Candidates, BRS, MLA, Candidates, action plan ready, Telangana, Assembly elections, elections, 119 seats, sitting MLAs, list ready, announcement, final list, medak, warangal, karimnagar,adilabad, 100 days, election fever, congress, gandhi bhavan, applications, BJP,

Tags:    

Similar News