రేపట్నుంచి అల్పాహార పథకం.. మహేశ్వరంలో ప్రారంభించనున్న సీఎం

Byline :  Kiran
Update: 2023-10-05 10:29 GMT

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్ట‌నుంది. విద్యావ్యవస్థను బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దసరా కానుకగా అక్టోబర్ 6 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. ఉన్న అన్ని తరగతుల విద్యార్థులకు ఇది అమలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం 8.45గంటలకు సీఎం కేసీఆర్ మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జ‌డ్పీహెచ్ఎస్‌లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27,147 పాఠ‌శాల‌ల్లో 23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌నున్నారు. శుక్రవారం పథకం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖ‌రారు చేసింది.

స్కూళ్లలో అందించే బ్రేక్ ఫాస్ట్ మెనూ

సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ

మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కూర్మ లేదా ట‌మాటా బాత్, చ‌ట్నీ

బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ

గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్

శుక్ర‌వారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ

శ‌నివారం – పొంగ‌ల్, సాంబార్ లేదా వెజిట‌బుల్ పులావ్, రైతా/ఆలు కూర్మ‌

బ్రేక్ ఫాస్ట్ అందించే సమయం

ప్రైమ‌రీ స్కూల్స్లో ఉద‌యం 8:45 గంట‌ల నుంచి అల్పాహారం అందించనున్నారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ ప‌రిధిలోని ప్రైమరీ స్కూల్స్లో ఉదయం 8 గంట‌ల నుంచి, అప్ప‌ర్ ప్రైమ‌రీ, హై స్కూళ్లల్లో ఉద‌యం 8:45 గంట‌ల నుంచి బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. 




Tags:    

Similar News