సీఎం కేసీఆర్ తిరుమలకు వెళ్లారు. మంగళవారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.
తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం శ్రీవారి తోమాల, సుప్రభాత సేవలో కేసీఆర్ కుటుంబసమేతంగా పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తిరిగి వస్తారు.