చందానగర్.. వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్

Update: 2023-05-31 12:39 GMT

ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఇవాళ (మే 31) చందాన‌గ‌ర్‌లోని వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారిని.. ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని ఈ సంద‌ర్భంగా మర్యాద పూర్వకంగా కలిసారు సీఎం కేసీఆర్. ఆయన వెంట ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు.



శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో.. 9 ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌నం నిర్మించారు. ఇవాళ జరిగిన సదనం ప్రారంభోత్స‌వానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి కూడా కార్యక్రమానికి హాజ‌రయ్యారు.






 


Tags:    

Similar News