కాసేపట్లో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..

Update: 2023-08-01 04:48 GMT

సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి.. 11.15 కు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి కొల్హాపూర్ అంబాబాయ్ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.45కు వాటేగావ్ చేరుకుని దళిత కవి అన్నాభావు సాఠే జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సాధు మహారాజ్కు నివాళులు అర్పించడంతోపాటు ఆయన మనుమడితో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 5.40కు ఆయన హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.

ఇటీవలే 600 కార్ల భారీ కాన్వాయ్ తో గులాబీ బాస్ మహారాష్ట్ర వెళ్లారు. టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు నిర్వహించారు. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అన్న కొడుకైన కల్వకుంట్ల వంశీధర్ రావును బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. 15 మందితో స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News