రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకోగా.. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సాధరంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, డీజీపీ మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిశారు. ఇవాళ రాత్రి రాజ్ భవన్ లోనే రాష్ట్రపతి ముర్ము బస చేస్తారు. శనివారం (జూన్ 17) దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఈ పరేడ్ కు సంబంధించి వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్లకు ప్రీ అమిషనింగ్ ట్రైనింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ కార్యక్రమంలో.. శిక్షణలో ప్రతిభ చూపెట్టిన క్యాడెట్లు.. రాష్ట్రపతి చేతుల మీదుగా ర్యాంకులు, అవార్డులు అందుకోనున్నారు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డు, వైమానిక దళ క్యాడెట్లకు వింగ్స్, బ్రెవెట్స్ ను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.