రేపు రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్

Update: 2023-11-08 17:42 GMT

తెలంగాణలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మరో రెండు రోజులే గడువు ఉండడంతో నామినేషన్లు వేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గురువారం రెండు చోట్ల నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11గంటలకు గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు కామారెడ్డిలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.

కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ గజ్వేల్లో ఈటల రాజేందర్ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని పోటీలో ఉంచింది. దీంతో ఈ సారి కేసీఆర్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈటల హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా.. రేవంత్ కొడంగల్, కామారెడ్డిల నుంచి బరిలో ఉన్నారు.


Tags:    

Similar News