CM Revanth : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఒక్క నిమిషంలో సంతకం చేస్తానన్న రేవంత్

Byline :  Krishna
Update: 2024-03-02 03:42 GMT

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. మంత్రి పొంగులేటి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో చర్చించి రోడ్ మ్యాప్తో తన దగ్గరకు వస్తే వెంటనే సంతకం పెడతానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మిగితా నామినేటెడ్ పోస్టులను పక్కనబెట్టి కేవలం మీడియా అకాడమీకే చైర్మన్ను నియమించినట్లు తెలిపారు.




 


జేఎన్జే సొసైటీకి 16ఏళ్ల క్రితం కాంగ్రెస్ సర్కార్ నిజాంపేట, పేట్ బషీరాబాద్ లో 70 ఎకరాలు కేటాయించినట్లు సొసైటీ సభ్యులు సీఎంకు వివరించారు. సొసైటీకి స్థలాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇళ్ల స్థలాల ప్రక్రియను 100 రోజుల్లో మొదలుపెడతామన్న హామీని అమలు చేస్తున్నందుకు సీఎంకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కాగా రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇక సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.


Tags:    

Similar News