Revanth Reddy : 2 గ్యారెంటీలపై అమలుకు ముహూర్తం ఫిక్స్.. రుణమాఫీపై త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానన్న సీఎం

Byline :  Kiran
Update: 2024-02-23 09:48 GMT

2 గ్యారెంటీల అమలు గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని ఈ నెల 27 సాయంత్రం నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని రేవంత్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టంచేశారు. 2 లక్షల ఉద్యోగాల హామీని తప్పక అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 25వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీతో యువతలో నైపుణ్యాలు పెంచుతామని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం అవినీతిపై జ్యూడీషియల్ విచారణ జరిపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై మోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం గురించి ఇంతకాలం పట్టించుకోని బీజేపీ ఇప్పుడు సీబీఐకు అప్పగిస్తామని అంటోందని మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నా కేసీఆర్ ఆపలేదని విమర్శించారు. కేసీఆర్ ఫాం హౌస్లో పడుకొని నీళ్ల దోపిడీ చేయించారని మండిపడ్డారు. రూ. 2లక్షల రుణమాఫీపై త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని రేవంత్ అన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలిసేదికాదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని అన్నారు.



 


Tags:    

Similar News