CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...పార్టీ పెద్దలతో భేటీ

Byline :  Vinitha
Update: 2024-02-19 06:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశరాజధానిలో కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలవనున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఓ ప్రాథమిక లిస్ట్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.

దీంతోపాటు, నామినేటెడ్ పోస్టులపై కూడా రేవంత్ చర్చలు జరపనున్నారు. అంతేగాక కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు లభించలేదు. దీంతో, మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ రేసులో ఉన్నారు. అటు నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి కేబినేట్ పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News