బీఆర్‌ఎస్‌ కుటుంబపాలనకే పరిమితమని మళ్లీ నిరూపించారు - సీఎం రేవంత్

Byline :  Kiran
Update: 2023-12-16 11:00 GMT

ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్లో మార్పు రాలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినా వారిలో మాత్రం మార్పు రాలేదని అన్నారు. ఇప్పుడైనా అసెంబ్లీలో ఇతరులకు అవకాశమిస్తారనుకుంటే ఇప్పుడు కూడా ఒక కుటుంబసభ్యులే మాట్లాడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారికి అవకాశమివ్వకుండా కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే మాట్లాడారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని సటైర్ వేశారు మా పార్టీ.. మా ఇష్టం అన్న భావన ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదని రేవంత్ అభిప్రాయపడ్డారు.

ప్రజలకు ప్రవేశంలేని, గద్దరన్నను ఎండలో నిలబెట్టిన ప్రగతి భవన్ కంచెలు బద్దలుకొట్టామని రేవంత్ అన్నారు. ప్రజా వాణి వినిపిస్తుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో హోం మంత్రిని, మంత్రి ఈటల రాజేందర్ను ప్రగతి భవన్లోకి రానివ్వకుండా అవమానించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు.

Tags:    

Similar News