మీరొచ్చి శివుడి తలపైనున్న గంగను భూమ్మీదకు తెచ్చిన్రా - రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు (kaleshwaram project) అద్భుతమని హరీశ్ రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో ఆయన చెప్పేవన్నీ అబద్దాలని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. కాళేశ్వరాన్ని రూ. 80వేల కోట్లతో కట్టామని చెబుతున్నారని, అయితే దీని కోసం కార్పొరేషన్ రుణమే రూ. రూ.97,448 కోట్లు మంజూరైందని చెప్పారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు, ఎన్ని రుణాలు తీసుకున్నారన్న విషయాలన్నింటినీ బయటకి తీస్తానని రేవంత్ స్పష్టం చేశారు. సాగునీటి శాఖ తొమ్మిదిన్నరేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ఉందని, ఇప్పుడు తప్పుడు లెక్కలతో ప్రజలను మధ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం (kaleshwaram) కోసం తీసుకున్న రూ.80వేల కోట్ల అప్పును ఆ ప్రాజెక్టుపై వచ్చే ఆదాయంతో చెల్లిస్తామని చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇలా చెప్పే అప్పులు తీసుకొచ్చారని అన్నారు. కాళేశ్వరం (kaleshwaram) నీటితో ఏటా రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు ముందు తెలంగాణ ప్రజలు నీళ్లు తాగలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు వచ్చాకే శివుడి తలపైనున్న గంగను భూమ్మీదకు తెచ్చారా అని సటైర్ వేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు (Mission Bhagiratha project) ద్వారా డబ్బులు సంపాదిస్తామని చూపారని, ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని మండిపడ్డారు.