CM Revanth Reddy:కేటీఆర్‌ సాయం అందించడం సంతోషకరం.. సీఎం రేవంత్ రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-12-27 09:18 GMT

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తు పత్రాన్ని మంత్రులతో కలిసి సీఎం విడుదల చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజావాణిలో న్యాయం జరుగలేదంటూ ఓ మహిళకు కేటీఆర్ సాయం చేయడం హర్షించదగిన విషయమని సెటైరికల్‌గా స్పందించారు. ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరించడం తమ ప్రభుత్వ లక్ష్యమని.. కేటీఆర్ ద్వారా ఆ మహిళ సమస్య పరిష్కారం అయిందని, కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక లక్షను ఆమెకు ఇచ్చారు అది చాలు అని అన్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు పీల్చి పిప్పిచేశారని అన్నారు. అసెంబ్లీలో విపక్ష నేతలకు పూర్తిగా స్వేచ్చనిచ్చామని తెలిపారు. కానీ, దానిని కేటీఆర్, హరీష్ రావులు దుర్వినియోగం చేసుకున్నారని అన్నారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడినివ్వకుండా బావ, బామ్మర్దులే హడావుడి చేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొన్నారని, వాటిని విజయవాడలో దాచిపెట్టారన్నారు రేవంత్. మూడోసారి అధికారంలోకి వస్తే వాటిని వాడుదామని కేసీఆర్ అనుకున్నాడన్నారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు.

ఇదే సమయంలో జర్నలిస్టు రాహుల్ పేరు ప్రస్తావించారు సీఎం రేవంత్. లోగో ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్ లో జర్నలిస్టులు ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా సీనియర్ జర్నలిస్టు రాహుల్ కూడా ఓ ప్రశ్న అడగటానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన సీఎం ‘రాహుల్ చెప్పండి’ అంటూ ముందే సరదాగా అడగటంతో అందరూ ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు ‘ఈ వార్త మా రాహుల్ రాయాలి’ అంటూ ప్రెస్‌మీట్లలో సరదాగా ప్రస్తావించడంతో జర్నలిస్ట్ రాహుల్ ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశాడని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్లి ప్రధానిని నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు

Tags:    

Similar News