CM Revanth Reddy : మధ్యాహ్నం రేవంత్ ప్రెస్ మీట్.. ఆ లెక్కలు బయటపెట్టే ఛాన్స్

Byline :  Bharath
Update: 2024-02-04 06:19 GMT

(CM Revanth Reddy) ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు సీఎం మీడియా ముందుకు వస్తున్నారు. 2014 నుంచి జరిగిన కృష్ణా జలాల ఒప్పంద వివరాలును ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి ముందే కేఆర్‌ఎంబీ వివాదంపై మాట్లాడాలని రేవంత్ నిర్ణయించారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇకపై బోర్డు ప్రాజెక్టుల నిర్వహణను చూసుకోనున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ హయాంలో ఈ ప్రతిపాదన వస్తే తిరస్కరించామని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్తుందని హరీష్ రావు, కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా జలాల ఒప్పంద వివరాలను లెక్కలతో సహా చెప్పాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. 


Tags:    

Similar News