ధరణి సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష.. 2గంటల పాటు చర్చ

By :  Kiran
Update: 2023-12-13 13:33 GMT

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహాతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు ధరణిపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.. పోర్టల్లోని లొసుగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశాల చర్చించినట్లు సమాచారం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ కమిటీ వేసే యోచనతో ఉన్నట్లు సమాచారం. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకువస్తామని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే ధరణి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.

ధరణి సమస్యల పరిష్కారం కోసం నెలకు ఓసారి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై అధికారులతో చర్చించిన రేవంత్ రెడ్డి త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారన్న వార్తలు వస్తున్నాయి.




Tags:    

Similar News