ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం : రేవంత్

Byline :  Krishna
Update: 2023-12-09 15:00 GMT

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఆరింటిలో.. మొదటగా రెండింటిని ఇవాళ అమలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలో ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇకపై రాష్ట్రం మొత్తం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు.

ఈ సందర్భంగా రేవంత్ ప్రత్యేక ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యచరణ మొదలైంది. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News