CM Revanth Reddy : లాస్యనందితకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

Update: 2024-02-23 12:08 GMT

(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మేడారం నుంచి తిరిగి వచ్చిన వెంటనే లాస్య నందిత నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆమె పార్థీవ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు సీఎం వెంట ఉన్నారు. మరోవైపు లాస్య నందిత అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. మారేడుపల్లి స్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.




 




Tags:    

Similar News