ఇవాళ ఢిల్లీకి రేవంత్.. ప్రధాని మోదీతో భేటీ

Byline :  Krishna
Update: 2023-12-26 01:30 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానిని కలిసే సంప్రదాయంలో భాగంగా రేవంత్‌తో పాటు భట్టి ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో వారు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మోదీతో చర్చించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై మోదీకి వినతి పత్ర అందజేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరతారు.

ఈ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జుతో ఖర్గేను సీఎం రేవంత్, భట్టిలు సమావేశం కానున్నారు. కుదిరితే రాహుల్ గాంధీతోనూ వీరు సమావేశమవుతారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై చర్చిస్తారు. కాగా సీఎం రేవంత్‌ జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో నిన్న సీఎం ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు.

Tags:    

Similar News