Revanth Reddy : అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలి..

Byline :  Vinitha
Update: 2024-03-02 11:28 GMT

తెలంగాణ సెక్రటెరియట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరైయ్యారు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా చూడాలని.. లబ్ధిదారులందరికి ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంతేగాక ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేసి పరిశీలించాలని తెలిపారు. అయితే ఇప్పటి వరకుర అంగన్వాడీ కేంద్రాలు రెంటెడ్ బిల్డింగుల్లోనే కొనసాగుతున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలని అధికారులకు చెప్పారు. అన్నిటికంటే ముందు మొదటి ప్రాధాన్యతగా భవన నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Tags:    

Similar News