Revanth Reddy : కేబినెట్ కీలక నిర్ణయాలపై సీఎం రేవంత్ ట్వీట్
(Revanth Reddy) తెలంగాణ కేబినేట్ మీటింగ్‌లో ఆమోదం పొందిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఒక జాతి అస్థిత్యానికి చిరునామా ఆ జాతి భాష సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో‘జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించమని ఆయన పేర్కొన్నారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా…రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగామని సీఎం తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షఅని తెలిపారు. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ట్వీట్టర్ ఎక్స్ ద్వారా పేర్కోన్నారు. నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ (TG)గా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఓకే చెప్పింది. తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.