Revanth Reddy : సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. సీఎం కీలక ప్రకటన

Update: 2024-02-08 03:32 GMT

తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభ వార్త చెప్పారు.సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. వీరిలో బ‌దిలీ వ‌ర్క‌ర్లు, జూనియ‌ర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్‌లు ఉన్నారు. రానున్న15 రోజుల్లో 15 వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం అన్నారు.

మరో 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని కొరారు. తమ సర్కార్ నిరుద్యొగులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర వహించారని ఆయన అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని ఆయన అన్నారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సీఎం అన్నారు.

Tags:    

Similar News