తెలంగాణలో కోకా కోల పెట్టుబడులు డబుల్

Update: 2023-08-26 07:12 GMT

తెలంగాణలో తమ పెట్టుబడులు డబులు చేసేందుకు కోకా కోల సంస్థ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తృతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఈ సంస్థ లేటెస్టుగా అదనపు ఇన్వెస్ట్‎మెంట్ ప్లాన్స్‎ను ప్రకటించింది. మంత్రి కేటీఆర్‎తో న్యూయార్క్ సిటీలో జరిగిన సమావేశంలో కోకా కోలా తన ప్రణాళికలను తెలిపింది. రాష్ట్ర సర్కార్ అందిస్తున్న సహకారానికి తోడు, వేగవంతంగా జరుగుతున్న ప్లాంట్ నిర్మాణ పనులు, బిజినెస్ డెవలప్మెంట్‎ను దృష్టిలో ఉంచుకొని కోకా కోలా కంపెనీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్‎లో అదనంగా మరో రూ.647 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అయ్యింది.




 


అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కోకా కోలా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ మేక్ గ్రివి మంత్రి కేటీఆర్‎తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..." ప్రపంచంలో మా మూడవ అతిపెద్ద మార్కెట్ భారత్. మా బిజినెస్‎ను మరింతగా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. అందుకే తెలంగాణలో ఇన్వెస్ట్‎మెంట్స్‎ను డబుల్ చేస్తున్నాం. అమీన్పూర్ కంపెనీలో ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణకు అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాం. సిద్దిపేటలో రూ.1000 కోట్లతో నూతన బాటిలింగ్ ప్లాంట్ కన్‎స్ట్రక్షన్ కోసం ఏప్రిల్ లో తెలంగాణ సర్కార్‎తో ఒప్పందం కుదుర్చుకున్నాం. తాజాగా రెండవ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నాం. కరీంనగర్ లేదా వరంగల్‎లో ఈ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చే అవకాశం ఉంది. ఈ నూతన ప్లాంట్ ఇన్వెస్ట్‎మెంట్‎తో కలుపుకుని తెలంగాణలో కోకాకోల కంపెనీ దాదాపుగా రూ. 2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుంది" అని అన్నారు.




 


కేటీఆర్ మాట్లాడుతూ.."తెలంగాణకు అన్ని సెక్టార్ల నుంచి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‎మెంట్స్ వస్తున్నాయి అని అనడానికి , కోకా కోల సంస్థ నిర్ణయమే సాక్ష్యంగా నిలుస్తుంది. ఐటీ , ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి సెక్టార్లలోనూ భారీ పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. లేటెస్టుగా ఇంటర్నేషనల్ కంపెనీ కోకా కోల రాష్ట్రంలో తన ఇన్వెస్ట్‎మెంట్స్ డబుల్ చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న అన్ని సహకారాలు అందిస్తాం" అని అన్నారు.


Tags:    

Similar News