hyderabad : నీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి సామీ..
అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు భద్రత ఎంత కట్టుదిట్టం చేసినా.. నేరస్తులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అడ్డదారిలో స్మగ్లింగ్ కు పాల్పడుతూ.. విమానాశ్రయాల వద్ద పట్టుబడుతుంటారు. తాజాగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి అక్రమంగా కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని ఎయిర్ పోర్ట్ అధికారులు సెప్టెంబర్ 2న అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లావోస్ నుంచి హైదరాబాద్ వస్తున్న వ్యక్తి.. ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ కింద కొకైన్ దాచాడు. డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చి అతన్ని విచారించగా.. ఐదు కిలోల కొకైన్ పట్టుబడింది. దీని విలువ మార్కెట్ లో రూ.50కోట్ల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కాగా పట్టుబడ్డ కొకైన్ ను సీజ్ చేసి.. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.