టార్గెట్ ఖమ్మం.. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ సభలు..!

Update: 2023-06-06 13:28 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అధికార ప్రతిపక్షాలు గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, అధికార పార్టీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని అన్ని పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ సస్పండ్ చేయడంతో జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన ఆత్మీయ సమ్మేళనాలు, వరుస పర్యటనలతో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. దీంతో మిగతా పార్టీల నేతలు సైతం అలర్ట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

ఖమ్మంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీలు అగ్రనాయకులతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో సభ జరగనుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న ఈ మీటింగ్ కు దాదాపు లక్ష మందిని సమీకరించాలని కమలదళం భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ నెలలోనే భారీ పబ్లిక్ మీటింగ్ కు ఏర్పాటు చేస్తోంది. రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఆ సభకు హాజరయ్యే అవకాశముంది. అటు సీపీఐ సైతం ఈ నెల 11న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ఆ పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నారు.

congress and bjp planing for public meetings in khammam districts

telangana,khammam,congress,bjp,public meeting,amit shah,priyanka gandhi,rahul gandhi,brs,ponguleti srinivas reddy,cpi,assembly segments

Tags:    

Similar News