తొలి జాబితా ఎంపికకు సిద్ధమైన కాంగ్రెస్.. రేపు తెలుస్తుంది
కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధం అయింది. నియోజక వర్గాల వారిగా అభ్యర్థలను ఎంపిక చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. సోమవారం (ఆగస్టు 14) సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధర్, తదితర కమిటీ సభ్యులు పాల్గొంటారు.
ఎన్నికల కమిటీ ఏర్పాటయ్యాక జరుగుతున్న మొదటి మీటింగ్ ఇదే కావడం విశేషం. 2018 ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చేవరకు.. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. దాంతో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ఆ పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ముందే టీ కాంగ్రెస్ ప్రక్రియ ప్రారంభించింది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులకు సంబంధించి వివాదం లేని 38 స్థానాల్లో.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని తొలి జాబితా విడుదల చేయనున్నారు.