నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..?

By :  Vinitha
Update: 2024-03-08 04:26 GMT

లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సీఈసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , సోనియా గాంధీ, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు వరకు అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించనున్నది. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజకవర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

అయితే బీజేపీ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే అనారోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైయ్యారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

Tags:    

Similar News