Bhatti Vikramarka : హైదరాబాద్కు మణిహారంగా మూసీని తీర్చిదిద్దుతాం - భట్టి

Byline :  Kiran
Update: 2024-02-10 07:56 GMT

మూసీ అంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితిని నుంచి అందమైన నదీ పరివాహక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. మూసీ ప్రక్షాళనతో పాటు నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందిస్తున్నామని అన్నారు. ఇటీవల సీఎం రేవంత్ లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నది నిర్వాహణ తీరు పరిశీలించారని, ఆ తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా వాకర్స్ జోన్, పీపుల్స్ ప్లాజాలు, ఓల్డ్ సిటీలోని హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్క్, ఎంటర్టైన్మెంట్ జోన్లు డెవలప్ చేస్తామని భట్టి ప్రకటించారు. మూసీ నదిని, నదీ తీరాన్ని ఓ పర్యావరణహిత పద్దతిలో సమగ్ర ప్రణాళికతో తీర్చిదిద్నున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కోసం మూసీ నది చుట్టూ ఉన్న భూములను వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చుతామని అన్నారు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతామని ఇందుకోసం బడ్జెట్లో రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు.




Tags:    

Similar News