మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారని.. ఇది ఈసీ రూల్స్ను బ్రేక్ చేయడమే అని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఫిర్యాదులో వివరించారు. ఈ క్రమంలో వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.