కేసీఆర్ అవినీతికి మోదీ అండ.. ఖమ్మం సభలో రాహుల్ ఫైర్

Update: 2023-07-02 15:09 GMT

బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ హవా లేదని, ప్ర్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం సాయంత్రం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ‘జనగర్జన’ బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అండతోనే కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని రాహుల్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ స్పష్టమైన సిద్ధాంతాలతో పనిచేసే పార్టీ అని, అందుకే ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని అన్నారు.

‘‘మోదీ ఏం నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ మద్దతిస్తారు. తెలంగాణ తన జాగీర్ అనుకుంటున్నారు. కాళేశ్వరం, భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. కేసీఆర్ అవినీతి మోదీ ఆశీస్సుల ఉన్నాయి. బీఆర్ఎస్ పాలతో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలుపడుతున్నారు. భూములు దోచుకోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో అదే జరుగుతుంది’’ అని అన్నారు.

మేం గెలిస్తే..

తమ పార్టీ అధకారంలోకి వస్తే ‘చేయూత’ పథకం కింద వృద్ధులకు, వితంతువులకు నెల నెల రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కేవలం కొంతమంది గిరిజనులకే కాకుండా అందరికీ పోడు భూములు మంజూరు చేస్తామన్నారు


Tags:    

Similar News