ప్రజలు ఓడించిన బీఆర్ఎస్కు బుద్ధిరాలేదు...Vamshi Chand

Byline :  Vinitha
Update: 2024-03-01 07:21 GMT

ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ కు బుద్ధిరాలేదన్నారు సీడబ్ల్యూసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కమీషన్లకు కేసీఆర్ కక్కేర్తి పడ్డారని..అందుకే కృష్ణాజలాలను వారికి అప్పగించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వాకంతోనే మేడిగడ్డ కూలిందని ఆరోపించారు. పదేండ్లుగా తెలంగాణ ప్రజలని బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు దేవరకద్ర నియోజకవర్గంలోని కర్వెన రిజర్వాయర్ ను కాంగ్రెస్ బృందం పరిశీలించారు.

కాళేశ్వరంలోని మిగిలిన ప్రాజెక్ట్ లు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేశామని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. మేడిగడ్డను బొందల గడ్డ అని గతంలో కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకే పాలమూరు టూర్ అని చెప్పారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎడారి ప్రాంతంగా మార్చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లడం సిగ్గుచేటని వంశీచంద్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News