బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నా చర్యలు తీసుకోకపోవడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఒకవేళ అది నిజం కాకపోతే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదో చెప్పాలని ప్రధాని మోడీని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు తెర ముందు విమర్శలు, తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని ఆరోపించారు. బండి సంజయ్ ను తొలగించడంతోనే బీజేపీ పరువు పోయిందని అందుకే తాను బీజేపీకి రాజీనామా చేశానని విజయశాంతి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రావడం సంతోషంగా ఉందని విజయశాంతి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్న విజయశాంతి రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.