హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ఖర్గే...

Byline :  Mic Tv Desk
Update: 2023-09-16 08:56 GMT

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ సమావేశాల సందడి మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు సభా స్థలి చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ వద్ద పార్టీ నేతలు స్వాగతం పలికారు. హోటల్ వద్ద భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతముందు శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాతీయ నేతలకు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు స్వాగతం పలికారు. డప్పుడోళ్లతో సందడి చేశారు. తాజ్ కృష్ణ హోటల్లో అగ్రనేతలతోపాటు సిద్ధరామయ్య సహా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విందు ఇచ్చారు. అక్కడే సీడబ్ల్యూ రెండు రోజుల సమావేశాలు ఈ రోజు నుంచి మొదలుకానున్నాయి. ఇటీవల ఏర్పాటైన కొత్త సీడబ్ల్యూసీలోని శాశ్వత సభ్యులు, ఆహ్వానితులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ రోజు జరిగే కార్యవర్గ సమావేశం భేటీ అవుతుంది. రేపు పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్ అబ్జర్వర్లు, ఆఫీస్ బేరర్లు మంతనాలు జరపుతారు.

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరో ఆరేడు నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హస్తం నేతలు చర్చిస్తారు. విపక్ష ఇండియా కూటమిలోని పార్టీతో పొత్తు, సీట్లు సర్దుబాటు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సమావేశాల ముగింపులో తీర్మానాలు ప్రకటిస్తారు.

Tags:    

Similar News