గద్దర్ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పీడిత వర్గాలను చైతన్యపరచడానికే తన జీవితాన్ని అర్పించిన మహాగాయకుడు అని కొనియాడారు. గద్దర్ పాటలు మనిషి కష్టాన్ని తెలియజేస్తాయని.. ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తి అని కొనియాడారు. ప్రస్తుతం సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ల సంఖ్య తగ్గిపోతుందని.. ఈ సమయంలో గద్దర్ మరణం తీరని లోటని చెప్పారు.
కాగా గద్దర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం గద్దర్కు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఇవాళ ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఊపిరితిత్తులు, మూత్రాశయ సంబంధిత సమస్యలు తలెత్తి.. మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూశారు.
పొడుస్తున్న పొద్దు అస్తమించింది 🙏
— Danasari Seethakka (@seethakkaMLA) August 6, ౨౦౨౩
ఓం శాంతి, జోహార్ గద్దర్ 💐#Gaddar #RIP pic.twitter.com/1vWr58Sxs3
Full View
Full View