MLC Mahesh Kumar Goud : సోనియా తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయిండు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ

Byline :  Krishna
Update: 2024-02-03 14:37 GMT

కాంగ్రెస్‌ నేతల మధ్య గొడవలు పెట్టాలని బీఆర్ఎస్ చూస్తోందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ తీసుకరావడం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే బీఆర్ఎస్ నేతలకు పదవులు వచ్చాయన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ బరాబర్ రాష్ట్రానికి వస్తారని.. ఆమెను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ విసిరారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వారు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోపిడి చేసిందని.. లెక్కలతో వారి అవినీతిని బయట పెడతామని చెప్పారు.

Tags:    

Similar News