కేసీఆర్ చేసేవన్నీ ఎన్నికల స్టంట్లే.. ఎవ్వరు నమ్మరు : కోమటిరెడ్డి

Byline :  Krishna
Update: 2023-09-14 14:43 GMT

ఎన్నికల స్టంట్లో భాగంగానే సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. 23 మోటార్లు గల.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేవలం ఒక మోటార్ను మాత్రమే కేసీఆర్ ప్రారంభించనున్నారని చెప్పారు. కేసీఆర్ జిమ్మికులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. కేటీఆర్ పనికిరాని మాటలు మానేసి పనిపై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.

ఈ నెల 17న తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సభను ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కొంగరకలాన్లో 500కోట్లు ఖర్చు పెట్టి సభ పెడితే 4లక్షల మంది కూడా రాలేదని.. కానీ సోనియా సభకు 10లక్షల కంటే ఎక్కువ జనం వస్తారని చెప్పారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే ఎప్పటికీ రాకపోయి ఉండేదని.. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ వెళ్లి సోనియాను కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హామీలు ఇవ్వడం తప్ప అమలు చేసింది లేదన్నారు. పలు జిల్లాల్లో ఉద్యోగులకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని.. బీహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోనూ ఉద్యోగులకు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే దళితబంధు లాంటి పథకాలతో కేసీఆర్ హడావుడి చేస్తారని విమర్శించారు. తాను నల్గొండ నుంచి పోటీ చేస్తానని.. ఈ సారి 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News